నటి కాజోల్ దేవగన్ డ్రస్ మార్చుకుంటున్నట్టు ఉన్న ఓ డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. డీప్ ఫేక్ నేరస్తులు కొన్ని రోజులుగా సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుని అసభ్యకరంగా వీడియోలు మార్ఫింగ్ చేస్తున్నారు. తాజాగా కాజోల్ వీడియో ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పబ్లిష్ అయింది. ఇప్పటి వరకు వేల సంఖ్యలో వ్యూస్ కూడా వచ్చాయి. అయితే ఈ వీడియో అసలు ఫుటేజ్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ఇటీవల హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియో విషయంలో బీహార్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడిని ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. అతడే ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడని అనుమానిస్తున్నారు. ఇంకా అతడిని అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పారు. ఓ ఇన్‌స్టా అకౌంట్ నుంచి ఆ వీడియోను తాను డౌన్‌లోడ్ చేసినట్లు యువకుడు చెప్పాడన్నారు.
ఇక నటి కీర్తి సురేష్ కి సంబంధించిన వీడియోలు కూడా కొన్ని ట్విట్టర్ ఎకౌంట్స్ లో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ.. ‘నేను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 10 ఏళ్లు పూర్తయింది. సినిమా ప్రపంచంలో 10 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కానీ మరోవైపు మా నటీమణుల పై ఫేక్ వీడియోలను వైరల్ చేయడం చాలా బాధాకరం అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. మొత్తమ్మీద ఫేక్ వీడియోల పై హీరోయిన్లు వరుసగా స్పందిస్తున్నారు.
Also Read:Ginger:అల్లం అతిగా తింటే ప్రమాదమా?