ఢీ షో జడ్జ్ పూర్ణకు బెదిరింపులు

213
poorna
- Advertisement -

టాలీవుడ్ హీరోయిన్, ప్రముఖ రీయాల్టీ డ్యాన్స్ షో ఢీ జడ్జ్ పూర్ణకు బెదిరింపు కాల్స్ రావడం చర్చాంశీయంగా మారింది. పూర్ణ స్వస్ధలం కేరళ. లాక్ డౌన్ కారణంగా ఆమె గత మూడు నెలలుగా అక్కడే ఉంటున్నారు. అయితే సోషల్ మీడియా ద్వారా పూర్ణను నలుగురు వ్యక్తులు బెదిరింపులకు గురిచేశారు. తాము అడిగినంత డబ్బులు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని బెదిరించారు. దీంతో వెంటనే పూర్ణ కుటుంబ సభ్యులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాఉ. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. అరెస్టైన వారిలో అష్రఫ్, రఫీఖ్, శరత్, రమేశ్ ఉన్నారు. నలుగురూ నటిని బెదిరిస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.అరెస్టైన వారిలో అష్రఫ్, రఫీఖ్, శరత్, రమేశ్ ఉన్నారు. నలుగురూ నటిని బెదిరిస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కాగా పూర్ణ పలు తెలుగు సినిమాలతో పాటు కేరళ, తమిళ్ మూవీల్లో నటిస్తోంది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేకపోవడంతో ఢీ షోలో జడ్జ్ గా చేస్తుంది.

- Advertisement -