గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న దర్శకుడు జీవన్ రెడ్డి..

149
Director Geevan Reddy
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హీరో సందీప్ మాధవ్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన జార్జి రెడ్డి సినిమా దర్శకుడు జీవన్ రెడ్డి నేడు కోంపల్లి లోని తన నివాసంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి ఛాలెంజ్‌ను చేపట్టారని దీనివలన పచ్చదనం పెరిగి కాలుష్యం తగ్గుతుందని ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సుకుమార్, క్రిష్, హీరో నితిన్, సందీప్ కృష్ణ, తిరువీరులను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -