యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా సూపర్‌స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు . ప్రభాస్ నటించిన ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమా దాదాపు 1500 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి దేశంలోనే టాప్ గ్రాసర్‌గా నిలిచింది. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ తన తర్వాతి చిత్రాన్ని ఖాయం చేసుకన్న సంగతి తెలిసిందే. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న గ్రాండ్ మూవీ ‘సాహో’.
దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా నటించేది ఎవరనే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్లుగా కత్రినాకైఫ్, శ్రద్ధా కపూర్, దిశా పటాని, దీపికా పడుకొనేల పేర్లు వినిపించాయి. తాజాగా మరోపేరు వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్ నటీమణి పరిణీతి చోప్రాను ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పరిణీతి చోప్రాను చిత్రబృందం సంప్రదించినట్టు కూడా సమాచారం. అయితే ఈ విషయమై ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఏదీ లేదు. త్వరలోనే హీరోయిన్ పేరును సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది.
ఇప్పటికే సాహోలో ప్రభాస్‌తో రొమాన్స్ చేసే హీరోయిన్ గురించి తెగ వెతుకుతున్నారు చిత్రటీమ్. అయితే ఇన్ని రోజులు హీరోయిన్ కోసం చెక్కర్లు కొడుతున్న చిత్ర టీమ్‌కి ఈ కష్టాలు ఎప్పుడు తప్పుతాయో చూడాలి.