విజయవాడలో సందడి చేసిన కాజల్ అగర్వాల్

574
kajal
- Advertisement -

స్వచ్ఛమైన విలక్షణమైన కంచి పట్టు వస్త్ర సోయగాలు ఇప్పుడు విజయవాడ వస్త్ర అభిమానులకు విధాత్రి అందుబాటులోకి తెచ్చింది. మనసులు దోచే కంచి పట్టు వస్త్రాలను ధరలకే విక్రయించేందుకు గాను విధాత్రి షాపింగ్ మాల్ శుక్రవారం విజయవాడ మొగలాజపురం లోని యం.జి.రోడ్డు పివిపి లేన్ లో ప్రారంభించారు. ప్రముఖ సినీ తార కాజల్ అగర్వాల్ ఈ షోరూమ్ ని ప్రారంభించింది.

షోరూం ప్రతినిధులు సందీప్, మైత్రియా మరియు సింధు మాట్లాడుతూ ..విధాత్రి షాపింగ్ మాల్ లో స్వచ్ఛమైన ఒరిజినల్ కాంచీపురం పట్టు వస్త్రాలను హోల్ సేల్ ధరలకే వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు. ఇక ఇప్పుడు పట్టు వస్త్రాల కొనుగోలు కోసం అందరూ కంచి కాదు… విజయవాడకు వస్తారని పేర్కొన్నారు. కంచి, ఉప్పాడ, బెనారస్, పోచంపల్లి ఇంకా మరెన్నో రకాల పట్టు చీరలు విధాత్రి షో రూమ్ లో లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు.

ఇంతేకాక కాలేజీ విద్యార్థుల కోసం లేటెస్ట్, వెరైటీ డ్రెస్సులు కూడా హోల్ సేల్ ధరలకే తమ వద్ద లభిస్తాయని అన్నారు. యువకుల కోసం షేర్వానీ లు కూడా విధాత్రి షోరూంలో లభిస్తాయని తెలిపారు. అన్ని వయసుల వారికి… అన్ని వేడుకలకు శుభకార్యాలకు కావలసిన వస్త్రాల నీటిని హోల్ సేల్ ధరలకే అందిస్తున్నాంమని ఈ చక్కటి అవకాశాన్ని విజయవాడ ప్రాంతవాసులు వినియోగించుకోగలరు అని నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -