మ‌రో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో అనుష్క‌….

337
anushka
- Advertisement -

లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ త‌నకంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్నారు హీరోయిన్ అనుష్క‌. క‌థానాయిక పాత్ర‌లంటే ద‌ర్శ‌కుల‌కు ముఖ్యంగా గుర్తుకు వ‌చ్చే హీరోయిన్ అనుష్క‌. ఆమె క‌థానాయిక‌గా న‌టించిన సినిమాలు అన్ని భారీ విజ‌యాన్ని అందుకున్నాయి. అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి వంటి సినిమాలు బాక్సాఫిస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టాయి. అనుష్క తాజాగా మ‌రో క‌థానాయిక పాత్ర ఉన్న సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్టు ఫిలిం న‌గ‌ర్లో చ‌ర్చ న‌డుస్తుంది.

Anushka-Shetty

కొత్త ద‌ర్శ‌కుడు హేమంత్ ఇటివ‌లే అనుష్క‌కు క‌థ‌వినిపించ‌డంతో ఆమెకు క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత కోన వెంకట్ బ్యాన‌ర్ అయిన‌టువంటి కోన కార్పొరేష‌న్..పీపుల్స్ మీడియా ఈసినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి. ఈసినిమాలో అనుష్క స‌ర‌స‌న మాధ‌వ‌న్ ను ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది.

anushka shetty

త్వ‌ర‌లోనే ఈసినిమాను సెట్స్ మీద‌కు తీసుకెళ్ల‌నున్నార‌ని తెలుస్తుంది. అనుష్క ప్ర‌స్తుతం ఏ సినిమాలో న‌టించ‌డం లేదు కాబ‌ట్టి విలైనంత త్వ‌ర‌గా ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించ‌నున్న‌ట్లు స‌మాచారం. అనుష్క‌కు ఎక్కువ‌గా సినిమాల్లో హీరోయిన్ గా కంటే లేడీ ఓరియంటెడ్ పాత్ర‌ల్లోనే ఎక్కువ‌గా న‌టిస్తుంది. అటు త‌మిళ్ లో న‌య‌న‌తారా ఎలాగైతే క‌థానాయిక పాత్ర‌ల్లో న‌టిస్తుందో…తెలుగులో కూడా అనుష్క ఎక్కువ‌గా క‌థానాయిక పాత్ర గ‌ల సినిమాలు చేస్తు వ‌స్తుంది.

- Advertisement -