విక్రాంత్ ఈ సినిమాతో హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘స్పార్క్ లైఫ్’. మెహరీన్, రుక్సర్ థిల్లాన్ హీరోయిన్స్. ఈ చిత్రానికి కథను అందిస్తూ స్క్రీన్ ప్లేను అందించారు విక్రాంత్. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లీల ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 17న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ సందర్భంగా…
పీపుల్ మీడియా టి.జి.విశ్వప్రసాద్ మాట్లాడుతూ ‘‘విక్రాంత్ నాకు మూడు నాలుగు నెలల నుంచి పరిచయం. మొదటి సినిమాతోనే విక్రాంత్ చేసిన రిస్క్, ఎక్స్‌పెరిమెంట్ నాకు ఎంతో నచ్చింది. తనకు సినిమాపై మంచి అవగాహన ఉంది. భవిష్యత్తులో తను మరిన్ని సినిమాలు చేస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్ మాట్లాడుతూ ‘‘నేను స్పార్క్ సినిమాలో విక్రాంత్ అండ్ టీమ్‌తో కలిసి పని చేయటాన్ని ఎంజాయ్ చేశాను. మణిరత్నంగారి సినిమాలకు నేను పెద్ద అభిమానిని. ఈ స్టేజ్‌పై ఇలా ఉండటంపై గర్వంగా అనిపిస్తుంది. గౌరవంగా భావిస్తున్నాను. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఖుషితో తెలుగు ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమను కురిపించారు. అదే ఎనర్జీతో స్పార్క్ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. విక్రాంత్, మెహరీన్, రుక్సర్, గురు సోమసుందరం వంటి వారితో కలిసి పని చేయటంపై ఎంతో సంతోషంగా ఉంది అన్నారు.
Also Read:ఆమె కోసం నిర్మాతలు ఎదురుచూపు
డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘‘స్పార్క్ ఎంటైర్ టీమ్‌కు ముందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. నిజం చెప్పాలంటే సుహాసినిగారు, మెహరీన్, రుక్సర్, మ్యూజిక్ డైరెక్టర్ హేషం, అనంత శ్రీరాంగారు తప్ప ఇంకెవరీ పేర్లు తెలియవు. ఈ సినిమా రిలీజ్ తర్వాత సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి.. అందరి పేర్లు ప్రేక్షకులకు గుర్తుండిపోవాలని కోరుకుంటున్నాను. యంగ్ టాలెంట్ ఇండస్ట్రీకి ఎంతో అవసరం. ట్రైలర్ చూశాను. చాలా రిచ్‌గా ఉంది. చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఉన్నారు. ప్రొడక్షన్ వేల్యూస్ చాలా గొప్పగా ఉన్నాయి. యాక్షన్, విజుల్స్ అన్నీ సూపర్బ్‌గా ఉన్నాయి. గురు సోమసుందరంగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయనతో కలిసి పని చేయాలనుకున్నాను. కానీ కుదరలేదు. త్వరలోనే చేస్తానని అనుకుంటున్నాను. అలాగే విక్రాంత్, లీలాగారు చాలా కష్టపడి ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వస్తున్నారు. వారికి టాలీవుడ్ ఇండస్ట్రీ వెల్‌కమ్ చెబుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. టీజర్, ట్రైలర్ రాకింగ్‌గా ఉన్నాయి. నవంబర్ 17న ఈ మూవీ వస్తుంది. సినిమాను థియేటర్స్‌లో చూడాలనుకుంటున్నాను అన్నారు.
Also Read:Congress:కాంగ్రెస్ కేరాఫ్ అరడజన్ దొంగలు!