స్టార్ హీరో ఆరోగ్య పరిస్థితి విషమం

109
- Advertisement -

మలేసియాలో బిచ్చగాడు- 2 సినిమా షూటింగ్ లో విజయ్ ఆంటోని గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే నిన్న రాత్రి వరకూ విజయ్ ఆంటోనీ కోలుకుంటున్నాడని ఆయన సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వచ్చాయి. పడవలో సడెన్ గా ప్రమాదం బారిన పడిన విజయ్ వెన్నెముక కొద్దిగా దెబ్బతింది అని, అయితే పెద్దగా ప్రమాదం ఏమి లేదని డాక్టర్లు చెప్పినట్లు కూడా చెప్పుకొచ్చారు. అయితే, విజయ్ ఆంటోనీ లేటెస్ట్ హెల్త్ బులిటెన్ మాత్రం ఆందోళనను కలిగిస్తోంది.

విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తాజాగా ఆయన భార్య ఫాతిమా వెల్లడించారు. ప్రస్తుతం విజయ్ అపస్మారక స్థితిలో ఉన్నాడని, తన పళ్ళు, దవడ ఎముక విరిగిపోయింది అని డాక్టర్స్ చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం విజయ్ ఆంటోని చెన్నైలోని ఓ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే.. బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ మలేషియాలో జరుగుతుండగా.. ఒక బోట్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో బోట్ అదుపుతప్పి ఎదురుగా ఉన్న పడవను ఢీకొంది.

దీంతో ఒక్కసారిగా విజయ్ ఎగిరి కిందపడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆయనను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మొదట విజయ్ పరిస్థితి విషమంగా ఉందని, ఆ తర్వాత విజయ్ కోలుకుంటున్నాడని తెలిసింది. కానీ, విజయ్ భార్య ఫాతిమా చెప్పిన లేటెస్ట్ హెల్త్ అప్ డేట్ ప్రకారం.. విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -