ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు..

35
- Advertisement -

హైదరాబాద్ అమీర్‌పేటలోని వివేకానందా కమ్యూనిటీ హాల్‌లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌..ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 16,533 కేంద్రాల్లో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం 1500 బృందాలను ఏర్పాటు చేశామని, ఒక్కో టీమ్‌లో 8 మంది సిబ్బంది ఉంటారని తెలిపారు. వంద రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని వెల్లడించారు.

తెలంగాణలో ప్రతి పథకం దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయని…మన పథకాలను అనేక రాష్ట్రాలు, కేంద్రం అనుసరిస్తున్నాయని చెప్పారు. కంటివెలుగును పంజాబ్‌, ఢిల్లీలో అమలు చేస్తామనడం తెలంగాణకు గర్వకారణమని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ, గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లకు టీమ్‌లను పంపిస్తామన్నారు. ప్రెస్‌క్లబ్‌లో కూడా కంటివెలుగు కార్యక్రమం చేపడుతామని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -