రైతుగా శర్వానంద్

439
Sharwanand
- Advertisement -

విభిన్నమైన కథలను ఎంచుకుంటు విజయాలను సొంతం చేసుకుంటున్నాడు హీరో శర్వానంద్. ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ తన కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శర్వానంద్ ఇటివలే రణరంగం సినిమాతో ప్రేక్షకుల మందుకు వచ్చాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈసినిమా బాక్సాఫిస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

విడుదలైన మొదటి రోజునుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. శర్వానంద్ కెరీర్ మంచి హిట్ గా నిలిచింది. శర్వా కు జోడిగా కళ్యాణి ప్రియదర్శన్ , కాజల్ అగర్వాల్ లు నటించారు. శర్వానంద్ తన తర్వాతి మూవీ కొత్త దర్శకుడు కిషోర్ రెడ్డితో చేయనున్నాడు.

ఈసినిమాలో శర్వా రైతు పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈసినిమా వ్యవసాయానికి సంబంధించిన కథగా ఉన్నట్లు తెలుస్తుంది. రామ్ ఆచంట, గోపిచంద్ ఆటంట ఈసినిమాను నిర్మించనున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

- Advertisement -