ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు- బాలకృష్ణ

121
Balakrishna
- Advertisement -

రంజ‌న్ ప‌ర్వ‌దినం సందర్భంగా టాలీవుడ్‌ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘మ‌త‌ గురువు మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త చూపిన మార్గాన్ని అనురిస్తూ నెల‌రోజులు ఉపావాస దీక్ష పూర్తి చేసుకున్న ముస్లింల‌కు నా స‌లాం. ఓ వైపు ఆధ్యాత్మిక‌త‌, మ‌ర‌వైపు స‌ర్వ మాన‌వ స‌మాన‌త్వాన్ని, సేవా భావాన్ని చాటి చెప్పేదే రంజాన్‌ అన్నారు బాలయ్య.

సత్ప్రవర్తనతోనే సామాజిక మార్పు సాధ్యమన్న మహ్మద్ ప్రవక్త సూక్తులు అందరికీ స్ఫూర్తిదాయకమని బాలయ్య చెప్పారు. ఈ రంజ‌న్ ప‌ర్వ‌దినం రోజున అంద‌రి జీవితాల్లో వెలుగులు నిండాల‌ని, అంద‌రూ సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని, దేవుడు మ‌న అంద‌రికీ మంచి భ‌విష్య‌త్తు ప్ర‌సాదించాల‌ని కోరుకుంటున్నాను’ అని బాల‌కృష్ణ పేర్కొన్నారు.

- Advertisement -