- Advertisement -
స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం నెలకొంది. అజిత్ తండ్రి పి. సుబ్రమణ్యం(84) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు.
అజిత్ ప్రస్తుతం భార్య షాలిని, పిల్లలతో యూరోప్ టూర్‌లో ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన అక్కడి నుంచి బయలుదేరారు. సుబ్రమణ్యం కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన మలయాళీ. ఆయన భార్య మోహిని బెంగాల్‌కి చెందినవారు. ఈ జంటకి ముగ్గురు పిల్లలు అనుప్ కుమార్, అజిత్ కుమార్, అనిల్ కుమార్. టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగారు అజిత్. ఇటీవలే ‘తెగింపు’ చిత్రంతో ప్రేక్షకులని అలరించారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -