America Visa:శుభవార్త చెప్పిన అమెరికా

15
- Advertisement -

లేఆఫ్ కారణంగా ఉద్యోగాలను కొల్పోతున్న విదేశీయులకు గుడ్ న్యూస్ చెప్పింది అమెరికా. ట్రావెల్ , బిజినెస్ వీసాలతో తమ దేశానికి వచ్చే వ్యక్తులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చని అమెరికా సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ వెల్లడించింది.

అయితే, ఉద్యోగంలో చేరేముందే ఆ వీసాను మార్చుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. బిజినెస్ పనుల కోసం వచ్చేవారికి బీ1 వీసా పర్యాటకులను బీ2 వీసాను అమెరికా జారీ చేస్తుంటుంది. తాజా నిర్ణయంతో ఈ రెండు వీసాల కేటగిరీల వ్యక్తులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వలసేతర కార్మికుల ఉపాధిని స్వచ్చందంగా లేదా అసంకల్పితంగా రద్దయినప్పుడు వారు సాధారణంగా యునైటెడ్ స్టేట్స్‌లో నిర్దేశిత వ్యవధిలో ఉండటానికి అర్హత ఉన్నట్లయితే అనేక చర్యలలో ఒకదాన్ని తీసుకోవచ్చని పేర్కొంది.

గతంలో నిబంధనల ప్రకారం ఉద్యోగం పోయిన 60 రోజుల గ్రేస్ పీరియడ్లోగా మరో ఉద్యోగం గానీ, ఉపాధి గానీ చూసుకోని పక్షంలో అమెరికా వీడాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -