దుమ్మురేపుతున్న అజిత్ ‘వాలిమై’..

40
hero ajith

తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాలిమై. ఈ సినిమా ప్రారంభమైన దగ్గరి నుండి అప్‌డేట్ కోసం ఎంతగానో ఫ్యాన్స్ వెయిట్ చేస్తుండగా వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ మేకర్స్‌ ట్రీట్ ఇచ్చారు.

యాక్షన్‌ థ్రిల్లర్‌ గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ అభిమానుల అనందాన్ని రెట్టింపుచేశాయి. ఇండియా వైడ్ గా ‘వాలిమై’ ట్రెండ్ అవుతోండగా ఇందులో అజిత్‌ సీబీ సీఐడి అధికారిగా కనిపించనున్నారు. అజిత్‌కు జోడీగా హ్యుమా ఖురేషి నటిస్తుండగా, టాలీవుడ్‌ నటుడు కార్తికేయ విలన్‌గా నటిస్తున్నారు. బేవ్యూ ప్రొజెక్ట్స్‌ పతాకంపై బోనీకపూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ ఏడాదే వాలిమై చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.