నగరంలో భారీ వర్షం

240
Heavy Rains In Hyderabad
- Advertisement -

నగరంలో భారీ వర్షం కురుస్తోంది.  పలు ప్రాంతాల్లో నేటి వేకువజాము నుంచి భారీగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. తెల్లవారుజాము 4 గంటలకు మొదలైన వర్షం.. భీకరమైన ఉరుములు, మెరుపులతో నగరవాసులను నిద్రలేపుతోంది. ఒకవైపు కరెంట్ కట్.. మరోవైపు వర్షంతో బయటకు వెళ్లలేని పరిస్థితి. దీంతో ఉద్యోగులు, ప్రయాణికులు చాలా వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. వర్షం రాకతో నగరంలో ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు పడిపోయింది.
 Heavy Rains In Hyderabadఏకధాటిగా కురుస్తున్న వర్షం వల్ల నగరంలోని మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ ,అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అయితే భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారుల్లో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. హైదరాబాద్‌ నగరానికి ప్రతిరోజు ఉదయం వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో బస్సులు వస్తుంటాయి.

అవన్నీ ఉదయం ఆరు గంటలకే గమ్యస్థానాలకు చేరిపోతుంటాయి. అయితే తెల్లవారుజామున 4 గంటలకే వర్షం ప్రారంభం కావడంతో రహదారులపై వర్షపు నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, ఎర్రగడ్డ, మూసాపేట ప్రాంతాల్లో వర్షపు నీరు రహదారులపై నుంచి ప్రవహిస్తుండటంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

Heavy Rains In Hyderabad

ఇదిలా ఉండగా భారీ వర్షంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. అంతేకాకుండా నగరంలో దాదాపు 838 పురాతన భవనాలను గుర్తించి, వాటిలో ఉన్న వారిని ఖాళీ చేయించే ప్రతయ్నం చేస్తున్నారు.

ఆ భవనాలు ఏ క్షణమైనా కూలే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో అత్యధికంగా సికింద్రాబాద్‌లో 216, అబిడ్స్‌లో 139, చార్మినార్‌లో 108, మెహదీపట్నంలో 73 శిథిలావస్థకు చేరిన భవనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భవానాలలో ఉన్నవారు ఖాళీ చేయాలని జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసింది.

- Advertisement -