అస్సాంలో భారీ వర్షాలు..నిలిచిన రవాణా

3
- Advertisement -

అస్సాంను భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడగా 22 జిల్లాల్లోని 5.35 లక్షల మందికిపైగా ప్రజలు ప్రభావితమయ్యారు. 15 నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. అసోం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ,మిజోరాం ఈ విపత్తుకు గురైన ముఖ్య రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీవ్రంగా దెబ్బతింది, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రవాణా మార్గం పూర్తిగా నిలిచిపోయాయి.

కేంద్ర మంత్రి జేపీ నడ్డా, బీజేపీ కార్యకర్తలకు “ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న అన్ని సహాయాలను అందించండి” అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే .. పీఎం కేర్ ఫండ్ ద్వారా సహాయం అందించాలని కోరారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వరదలతో అతలాకుతలమైన లఖింపూర్‌ను సందర్శించి, పూర్తి సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

గువహటిలో మేఘాలయ సీఎం కోన్రాడ్ సంగ్మాతో సమావేశమైన శర్మ, నగరంలో పునరావృతమైన నీటి నిలిచిపోవడం సమస్యపై చర్చించారు. మేఘాలయ రీ-భోయ్ జిల్లాలో చేపట్టిన కొండ త్రవ్వకాలు దీని కారణమని శర్మ పేర్కొన్నారు.

Also Read:మీ ప్రేమ, ఆత్మీయత మర్చిపోలేను!

- Advertisement -