తెలుగు రాష్ట్రాలు..వెదర్ అప్‌డేట్

8
- Advertisement -

తెలుగు రాష్ట్రాల వెదర్ అప్‌డేట్‌ని ఇచ్చింది వాతావరణ శాఖ. ఉత్తర మరియు తూర్పు తెలంగాణలో వేడి కొనసాగే అవకాశం ఉందని…కొమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40°C లేదా అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అన్నారు.

ఉత్తర, దక్షిణ మరియు తూర్పు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 35–36°C వరకు ఉండొచ్చు. సాయంత్రం నాటికి తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని వెల్లడించారు.

#ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్‌టిఆర్, ఏలూరు, గోదావరి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40°C లేదా అంతకంటే ఎక్కువకు ఉండొచ్చని తెలిపారు. చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని… #విశాఖపట్నంలో గరిష్ట ఉష్ణోగ్రత సుమారు 36°C ఉండొచ్చు, మధ్యమ స్థాయి ఆర్ద్రత ఉండే అవకాశం ఉందని వెల్లడించారు.

Also Read:మీ ప్రేమ, ఆత్మీయత మర్చిపోలేను!

- Advertisement -