తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

13
- Advertisement -

బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాన్‌కు రెమల్‌గా నామకరణం చేయగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజులపాటు తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. పార్వతీపురం మన్యంతో పాటు కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

అనకాపల్లి, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, నంద్యాల, అనంతపురం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Also Read:వచ్చే ఏడాది ఐపీఎల్లో ధోని!

- Advertisement -