రాకేష్ రెడ్డిని గెలిపించండి:అనిల్ కూర్మాచలం

14
- Advertisement -

తెలంగాణలో ఉమ్మడి నల్గొండ- వరంగల్- ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం పట్టభద్రులను కోరారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో మాత్రమే కాకుండా, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, కెసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని అనిల్ గుర్తుచేశారు.

నేడు ఉమ్మడి నల్గొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటర్లంతా విజ్ఞతతో అలోచించి ప్రజలపక్షాన ప్రశ్నించే బీఆర్ఎస్ గొంతుకు మద్దతుగా నిలిస్తే కేవలం పట్టభద్రుల సమస్యల కోసమే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకు అండగా ఉండి పోరాడుతారని కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని కోరారు.

పట్టభద్రుల పట్ల సమాజంలో ప్రత్యక గౌరవముందని, కాబట్టి ఇలాంటి సమయాల్లో ఇతరులకు ఆదర్శంగా నిలిచే విధంగా సమర్ధవంతమైన అభ్యర్ధికి, సమాజంలో అన్ని వర్గాల ప్రజల పక్షాన నిలబడి సేవ చేసే వారి పక్షాన నిలిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, అంతే కానీ ప్రజల్ని మోసం చేసి స్వార్థ రాజకీయాల కోసం వ్యక్తిగత ఎదుగుదల కోసం అడ్డ దారులు తొక్కే వారు గెలిస్తే మీ పట్ల కూడా ప్రజలకు చులకన భావం ఏర్పడుతుందని కాబట్టి విజ్ఞతతో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందికి గురి చేసారు, కరెంటు, నీళ్ళు, రైతులకు రైతు బంధు, పంట బోనస్ ఇట్లా అన్ని విషయాల్లో రైతులని ప్రజల్ని ఇబంది పెట్టారు. అలాగే గతంలో కేటీఆర్ గారి నాయత్వంలో రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, రోజుకొక సంస్థ హైదరాబాద్ కి వచ్చేవి కానీ నేడు అలాంటి వార్త ఒక్కటి కూడా లేదు, కొత్తవి రాకపోగా ఇతర రాష్ట్రాలకి తరలి వెళ్లిపోతున్నాయి. చదువుకున్న పట్టభద్రులు ఆలోచన చెయ్యాలి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, గతంలో అటు ప్రైవేట్ ఇటు ప్రభుత్వ రంగంలో దేశంలో ఎక్కడ కూడా జరగని నియామకాలు కెసిఆర్ గారి నాయకత్వంలో జరిగాయి. నేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కి ఓటు వేస్తే అధికార కాంగ్రెస్ కి ఒక హెచ్చిరికలాగా ఉంటుంది, మన రాష్ట్ర ప్రయోజనాలకోసం పట్టభద్రులు నిలదీస్తున్నారనే భయం ఉంటుంది, రేపు మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని కోరారు.ప్రపంచవ్యాప్త ఎన్నారైలంతా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఉమ్మడి నల్గొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రులను కోరారు.

Also Read:లోకేష్‌ని టీడీపీ అధ్యక్షుడిని చేయాలి!

- Advertisement -