లోకేష్‌ని టీడీపీ అధ్యక్షుడిని చేయాలి!

4
- Advertisement -

నారా లోకేష్‌ని టీడీపీ అధ్యక్షుడిని చేయాలన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజే నారా లోకేశ్ ను పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని బుద్దా వెంకన్న అన్నారు. లోకేశ్‌ని టీడీపీ అధ్యక్షుడిగా నియమిస్తే మరో 30 ఏళ్లు పార్టీ బతుకుతుందని చెప్పారు.

అచ్చెన్నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాగా పనిచేశారని…ఆయనకు మంత్రి వర్గంలో కీలక శాఖ కేటాయించాలని చంద్రబాబును కోరారు. చంద్రబాబుని కోరుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడి ఆత్మకథలో తనకో పేజీ ఉంటుందని తెలిపారు.

గతంలో టీడీపీ ఓడిపోయాక చాలామంది పార్టీని వదిలి పారిపోయినప్పటికీ తాను మాత్రం నిలబడ్డానని చెప్పారు. పోరాటం చేయని వాళ్లు, బ్లాక్ మెయిలింగ్ చేసి టిక్కెట్లు తెచ్చుకున్నారని అన్నారు.

Also Read:వచ్చే ఏడాది ఐపీఎల్లో ధోని!

- Advertisement -