రాష్ట్రానికి భారీ వర్షసూచన..

54
rains
- Advertisement -

రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 8 జిల్లాలకు ఆరెంజ్, 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. నిర్మల్‌, నిజామాబాద్ , ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో పరీవాహక ప్రాంతాల్లో సాగు చేసిన పంటలు చాలా వరకు నీట మునిగాయి. ఇక వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా కూరగాయ, ఆకు కూరల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

- Advertisement -