రాష్ట్రానికి వర్ష సూచన..

79
rains
- Advertisement -

రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని …రాష్ట్రంలో కొన్నిచోట్ల ఆదివారం నుంచి మంగళవారం వ‌ర‌కు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని ప్ర‌క‌టించింది.

అకాల వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటికే కురిసిన వ‌ర్షాల‌తో రైతులు భారీ నష్టపోగా పంట మొత్తం నీటిపాలైంది. ఈ క్రమంలో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -