అఫ్గానిస్తాన్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. పాకిస్తాన్ సైన్యం కాబూల్, కాందహార్, పక్టియా ప్రాంతాలపై బాంబులు, మిస్సైళ్లతో దాడులు చేసినట్లు సమాచారం. ఉగ్రవాద మౌళిక సదుపాయాలపై లక్ష్యబద్ధంగా చర్యలు చేపట్టామని ఇస్లామాబాద్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అఫ్గాన్ వర్గాలు మాత్రం పౌర ప్రాంతాలకూ నష్టం జరిగిందని ఆరోపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా తాళిబాన్ దళాలు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటికే ఇరు దేశాల సైనికులు వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి.
Also Read:Ind Vs Wi:మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే?
ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌కు మద్దతు ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఉగ్రవాదంపై కఠిన చర్యలు అవసరమని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. పరిస్థితి మరింత విషమించకుండా ఉండేందుకు అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలనే పిలుపులు వినిపిస్తున్నాయి.

