తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు జిల్లా కలెక్టర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర పరిపాలన వేగవంతం చేయడం, అభివృద్ధి కార్యక్రమాల అమలును సమీక్షించడం ఈ భేటీ ముఖ్య ఉద్దేశ్యం. ముఖ్యంగా “99 రోజుల యాక్షన్ ప్లాన్” రూపకల్పనపై సమగ్ర చర్చ జరగనుంది.
ప్రతి జిల్లాలో ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలు, ఆదాయ వృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించే అవకాశం ఉంది. పనితీరు ప్రమాణాలను ఖరారు చేసి, గడువులలోగా లక్ష్యాలను సాధించేందుకు కలెక్టర్లకు మార్గదర్శకాలు ఇవ్వనున్నారు.
ఇదిలా ఉండగా, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్రంలోని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం సమావేశం కానున్నారు. శాఖల వారీగా ప్రాధాన్యత అంశాలు, పెండింగ్ పనులు, విధాన నిర్ణయాలపై చర్చించనున్నారు. ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ఫలితాలు అందించాలని సీఎం స్పష్టం చేయనున్నట్లు సమాచారం. ఈ సమావేశాలు రాష్ట్ర పాలనలో కొత్త దిశను నిర్దేశించనున్నాయి.
Also Read:Ind Vs Wi:మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే?


