Ind Vs Wi:మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయితే?

9
- Advertisement -

జింబాబ్వేపై 72 పరుగుల భారీ విజయం సాధించిన భారత్, ఇప్పుడు తమ చివరి సూపర్ 8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ విజయంతో భారత్ సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఇక ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్ వాస్తవానికి క్వార్టర్ ఫైనల్‌లాంటిదే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుతుంది.

అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, భారత్ మరియు వెస్టిండీస్ రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభిస్తుంది. అలా అయితే సూపర్ 8లో మూడు మ్యాచ్‌ల తర్వాత రెండు జట్లకూ 3 పాయింట్లు ఉంటాయి. కానీ ప్రస్తుతం నెట్ రన్‌రేట్ (NRR) విషయంలో వెస్టిండీస్ ముందంజలో ఉంది. జింబాబ్వేపై 101 పరుగుల భారీ విజయంతో వారి NRR గణనీయంగా పెరిగింది. దక్షిణాఫ్రికాతో తొమ్మిది వికెట్ల తేడాతో ఓడినా, వారి NRR 1.791గా ఉంది. మరోవైపు భారత్ NRR -0.1గా ఉంది. మ్యాచ్ రద్దయితే మెరుగైన NRR కారణంగా వెస్టిండీస్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది, భారత్ టోర్నమెంట్ నుంచి బయటపడుతుంది.

ఇలా జరిగితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై విమర్శలు రావచ్చు. జింబాబ్వే మ్యాచ్‌లో బుమ్రా, హార్దిక్ పాండ్యా ఓవర్లు పూర్తి చేయకుండా, శివమ్ దూబేకు రెండు ఓవర్లు ఇచ్చి 46 పరుగులు ఇచ్చిన అంశం చర్చకు దారి తీసింది. బుమ్రా, హార్దిక్ ఆ ఓవర్లు వేసి ఉంటే, భారత్ మరింత భారీ తేడాతో గెలిచి NRR మెరుగుపరుచుకునే అవకాశముండేది.

Also Read:ఒత్తిడితో పురుషుల్లో సంతానోత్పత్తి సమస్య..!

ఆదివారం (మార్చి 1) ఎలాంటి వర్షం అవకాశమూ లేదని అంచనా. పగటిపూట ఉష్ణోగ్రత 34 డిగ్రీల వరకు ఉండగా, మ్యాచ్ సమయానికి 25-26 డిగ్రీలకు తగ్గనుంది. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, టాస్ 6:30కు జరుగుతుంది.

- Advertisement -