ముంబైలో భారీ వర్షం..గోడకూలి 13మంది మృతి

310
mumbai
- Advertisement -

గత  రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ముంబై నగరం అస్తవ్యస్తంగా మారింది. వర్షపు నీరుతో నగరం మొత్తం నీటితో నిండిపోయింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఇక నిన్న సాయంత్రం భారీ వర్షం కురవడంతో ఘోర ప్రమాదం జరిగింది. మలాడ్ ఈస్ట్ ప్రాంతంలోని పింప్రిపాద్ కాలనీలో గోడకూలి 13 మంది మృతి చెందగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఎన్డీఆర్‌ఎఫ్ బృందం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, బీఎంసీ సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. వర్షం కారణంగా రెండు రోజులు పాఠశాలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ముంబై నుంచి నడిచే రైళ్లు, ముంబైకి చేరుకునే రైళ్ల సర్వేసులు రద్దు చేస్తున్నట్లు వెస్టన్ రైల్వే ప్రకటించింది.

ముంబైకి వెళ్లే పలు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు, కొన్ని సర్వీసులను అహ్మదాబాద్‌కు మళ్లిస్తున్నట్లు ఇండిగో విమాన సంస్థ ప్రకటించింది. మలాడ్ ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందని ఈ ఉదయం ట్వీట్ చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

- Advertisement -