Amla:ఉసిరి తింటే డేంజర్..జాగ్రత్త!

45
- Advertisement -

ఉసిరికాయ గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. శీతాకాలంలో ఎక్కువగా లభించే ఉసిరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉసిరికాయను వివిద సలాడ్ లలోనూ జ్యూస్ ల రూపంలోనూ సేవిస్తూ ఉంటారు. ఇంకా ఉసిరికాయతో చేసే పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉసిరికాయ లో ఉండే ఎన్నో పోషకాలు మన శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్ బి కాంప్లెక్స్, పాలిపెనల్స్, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో అవసరమైనవి. ఉసిరిని మనం తినే ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. .

అలాగే చర్మ సమస్యలను దూరం చేయడంలోనూ, జుట్టు సమస్యలను తగ్గించడంలోనూ ఉసిరి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఉసిరి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నప్పటికి.. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉసిరికి దూరంగా ఉండడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా లోబీపీతో బాధపడేవారు ఉసిరిని పరిమితంగానే తీసుకోవాలట ఎందుకంటే దీనిలో బీపీని తగ్గించే గుణాలు ఉంటాయి. అందువల్ల లోబీపీతో బాధపడే వారు ఉసిరి తినడం వల్ల ఆ సమస్య మరింత పెరుగుతుంది. ఇక అలాగే షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు కూడా ఉసిరికి దూరంగానే ఉండాలట. ఎందుకంటే అలాంటి సమస్య ఉన్నవారికి ఉసిరి తినడం వల్ల హైపోగ్లైసీమియా కు దారి తీయవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా జలుబు, దగ్గు ఎక్కువగా ఉన్నవారు కూడా ఉసిరికి దూరంగా ఉండాలి లేదంటే ఎసిడిటీకి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్న మాట.

Also Read:వ‌సంత మండ‌పంలో తులసి దామోద‌ర పూజ‌

- Advertisement -