వెన్నెముక ఫ్లెక్సిబిలిటీని పెంచే ‘వక్రాసనం’!

23
- Advertisement -

నేటిరోజుల్లో చాలమందికి వెన్నునొప్పి సమస్యలు అధికమౌతున్నాయి. ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వల్ల లేదా శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం వల్ల వెన్నునొప్పి సమస్యలు వస్తుంటాయి. వెన్నునొప్పి సమస్య అధికంగా ఉన్నప్పుడూ ఏపని చేయడానికి వీలు పడదు. కూర్చోవడానికి, నడవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ వెన్నునొప్పి సమస్యను తగ్గించడానికి యోగాలో ” వక్రాసనం ” ఎంతొగానో ఉపయోగ పడుతుంది.

ప్రతిరోజూ ఉదయాన్నే ఈ వక్రాసనం వేయడం వల్ల వెన్నెముక యొక్క ఫ్లెక్సిబిలిటీ పెరగడంతో రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది దాంతో వెన్నెముక ఎంతో దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించడంలో కూడా వక్రాసనం ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇక ఈ ఆసనంలో వెనుకకు తిరిగి ఆగినప్పుడు ఏర్పడే కంప్రెషన్ వల్ల ఉదర కండరాలు ఎంతో దృఢంగా తయారవుతాయి.

​వక్రాసనం వేయు విధానం

​ముందుగా సుఖసనంలో కూర్చొని రెండు కాళ్ళను ముందుకు చాచాలి. ఆ తరువాత ఎడమకాలిని మోకాలు వరకు మడిచి కుడి కాలి మీదుగా తీసుకెళుతూ పోటో లో చూపిన విధంగా చేయాలి. ఇప్పుడు కుడిచేతితో ఎడమకాలి మడమను పట్టుకొని ఎడమచేతిని శరీరం వెనుకగా వెన్నెముక కిందుగా ఉంచాలి. తర్వాత గాలి ధీర్ఘంగా పిల్చు నెమ్మదిగా వదులుతూ తలను భుజాలకు ఎడమవైపుగా తిప్పి భుజాల మీదుగా వెనుకకు చూస్తూ శ్వాస క్రియను నెమ్మదిగా జరిగించాలి. ఇదే విధంగా రెండవ వైపు కూడా చేయాలి. ఇలా వక్రాసనం వీలైనంత సమయం వేయాలి.

​జాగ్రత్తలు

​తీవ్రమైన మెడనొప్పి, వెన్నునొప్పి సమస్యలు ఉన్నవాళ్ళు, అల్సర్, హెర్నియా వంటి రుగ్మతలు ఉన్నవాళ్ళు ఈ ఆసనం వేయడం మంచిది కాదని యోగా నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -