వర్షాకాలంలో వచ్చే అలెర్జీలకు వీటితో చెక్..!

90
- Advertisement -

వర్షాకాలం వచ్చేసింది. భగ భగ మండే ఎండలు తగ్గి వాతావరణం చల్లబడింది. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఎన్నో సాధారణ ఆరోగ్య సమస్యలు తీవ్ర ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తరచూ జలుబు పరిన పడడం, ఫ్లూ ఇన్ఫెక్షన్స్, జ్వరం, దగ్గు.. ఇలా పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇంకా వర్షాకాలంలో అలెర్జీలు, ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్.. బ్యాక్టీరియా, వ్యాధికారక వైరస్.. ఇలా చెప్పుకుంటూ పోతే వర్షాకాలంలో తలెత్తే సమస్యలు అన్నీ ఇన్ని కావు. కాబట్టి ఈ వర్షాకాలంలో వీటన్నిటి నుంచి సంర్థవంతంగా ఎదుర్కోవాలంటే రోగనిరోదక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. అందువల్ల మనం తినే ఆహార పదార్థాలలో ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.. !

సిట్రిస్ పండ్లు
నిమ్మ, బత్తాయి, ఆరెంజ్, వంటి ఫలలన్నీ సిట్రిస్ జాతికి చెందినవే. వీటిలో సిట్రిక్ ఆమ్లంతో పాటు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల ప్రతిరోజూ మన హర డైట్ లో సిట్రిస్ పండ్లు ఉండేలా చూసుకోవాలి.

ఉల్లిపాయ
ఉల్లిపాయలో సల్ఫర్, పొటాషియం, విటమిన్ కె వంటివి పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ వర్షాకాలంలో వచ్చే అలెర్జీలను దూరం చేయడంతో పాటు వివిద రకాల వైరస్ లు, బ్యాక్టీరియాలు మన శరీరంలోకి చేరినప్పుడు సమర్థవంతగా ఎదుర్కొనేందుకు బాడీలోని ఆర్గాన్స్ ను యాక్టివ్ చేస్తుంది. అందువల్ల మన ఆహార డైట్ లో ఉల్లిపాయ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

టమాటోలు
టమాటోలలో కూడా సి విటమిన్ అధికంగానే ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందువల్ల వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవాలంటే మనం తినే ఆహారంలో టమాటో కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

ఇంకా వీటితో పాటు పసుపు, అల్లం వంటివి కూడా మనం తినే ఆహారంలో కచ్చితంగా ఉండేలా చూసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. పసుపు అనేది ఎలాంటి సమస్యలకైనా యాంటీ బయోటిక్ లా పని చేస్తుంది. అలాగే అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు వర్షాకాలంలో వచ్చే గొంతు సమస్యలను తగ్గిస్తుంది.

Also Read:ఆ చిన్న సినిమాకి 40 కోట్లు..గ్రేట్

- Advertisement -