ఇలా చేస్తే తెల్లజుట్టు మటుమాయం!

91
- Advertisement -

నేటి రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరికీ తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. చిన్న పిల్లలను కూడా ఈ తెల్ల వెంట్రుకల సమస్య వేధిస్తోంది. తలపై నల్లజుట్టు కంటే తెల్ల జుట్టు అధికంగా ఉండడం వల్ల నలుగురిలో ఉన్నప్పుడూ హేళనకు గురి అవుతూ ఉంటారు. అయితే వయసుతో సంబంధం లేకుండా ఇలా తెల్ల జుట్టు రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. మారుతున్న ఆహారపు అలవాట్లు, వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు.. హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్, వంటి కారణాల వల్ల చిన్న వయసులోనే తెల్ల సమస్య వేధిస్తోంది. అయితే ఈ తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు చాలమంది. మార్కెట్లో దొరికే మెడిసన్స్, హెయిర్ డ్రైలు వంటివి ఎన్నో వాడుతూ ఉంటారు. అయితే వాటి వల్ల ఫలితం సంగతి అలా ఉంచితే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం గట్టిగానే ఉంటాయి. అయితే సహజసిద్దంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి ఆయుర్వేదంలో ఒక మంచి చిట్కా ఉంది. అదేంటో చూద్దాం

ముందుగా ఒక గ్లాస్ మంచి నీరు తీసుకొని ఒక గిన్నెలో పోసి బాగా వేడి చేయాలి. ఆ తరువాత ఆ వేడి నీటిలో మూడు స్పూన్ల టీ పౌడర్ వేయాలి. టీ పౌడర్ వేడి నీటిలో కలిసిపోయిన తరువాత నాలుగు లవంగాలు అందులో వేయాలి. ఈ మిశ్రమాన్ని అయిదు నిముషాలు అలాగే మరిగించి ఒక గ్లాస్ లోకి తీసుకొని వడ కట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు బీట్ రూట్ గడ్డలు తీసుకొని దానిపై తొక్క తీసి మెత్తటి పేస్ట్ ల చేసుకొని దీని రసాన్ని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి.

Also Read:కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచ స్థాయి గుర్తింపు

ఆ తరువాత ఈ రసానికి రెండు స్పూన్ల కాఫీ పొడి, ఒక స్పూన్ ఉసిరి పొడి, ఒక స్పూన్ హెన్నా పౌడర్ వేసి బాగా కలపాలి. ఆ తరువాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న టీ డికాషన్ లో ఈ మిశ్రమాన్ని వేసి ఒక నిమ్మకాయ రసాన్ని అందులో వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్నా మిశ్రమాన్ని రాత్రంతా అలాగే ఉంచితే మరుసరి రోజుకి ఆ మిశ్రమం నల్లగా మారుతుంది. దాన్ని కావలసిన మోతాదులో తలకు పూర్తిగా వెంట్రుకల కుదుళ్ల వరకు రాసుకోవాలి. ఆ తరువాత రెండు గంటలు అలాగే ఉంచి తలస్నానం చేయాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల తెల్లగా ఉన్న జుట్టు ముందుగా బ్రౌన్ కలర్ లోకి వస్తుంది. కొన్ని రోజుల పాటు ఇలాగే చేస్తే తెల్లజుట్టు మొత్తం పూర్తిగా నల్లగా మారుతుంది.

 Also Read:రూ.2వేల నోటు..ఆర్బీఐ మరో కీలక ప్రకటన

- Advertisement -