రూ.2వేల నోటు..ఆర్బీఐ మరో కీలక ప్రకటన

39
- Advertisement -

రూ.2 వేల నోట్ల రద్దుపై ఆర్బీఐ మరో కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 30 తర్వాత రూ.2 వేల నోట్లు చెల్లవని చెప్పలేదని స్పష్టం చేసింది. నేటి నుంచి రూ.2వేల నోటును మార్చుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగనుందని పేర్కొంది.

ఒక్కొక్కరు రోజుకు పది నోట్లను మార్చుకునే అవకాశం కల్పించింది. మార్పిడికి సంబంధించిన రోజు వారి సమాచారాన్ని నిర్ణీత నమూనాలో అందించాలని ఆర్బీఐ ఆదేశించింది. రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్లకు పాన్ సమర్పించాలనే నిబంధన ఉంది. రూ.2వేల నోట్ల డిపాజిట్లకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది.

Also Read:హ్యాపీ బర్త్ డే..రాఘవేంద్రరావు

2016 నవంబర్ లో రూ.2 వేల నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టింది. అప్పటివరకు చెలామణిలో ఉన్న రూ.1000 నోట్ల స్థానంలో రూ.2వేల నోట్లను తీసుకొచ్చింది. 2018, 2019 నుంచి రూ.2వేల నోట్ల ప్రింటింగ్ ను ఆపేసింది. 2023 మార్చి 31 నాటికి 3లక్షల 62 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు సర్క్యూలేషన్ లో ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది.

Also Read:కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచ స్థాయి గుర్తింపు

- Advertisement -