ప్రతిరోజూ ఆరోగ్యంగా ఉండేందుకు శారీరక శ్రమ చాలా అవసరం. అందుకే రోజుకు ఒక అరగంట వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే చాలమందికి వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపరు. అలాంటివారు యోగా చేయడం అలవాటు చేసుకుంటే మంచిదట. యోగాలో ఉండే ప్రతి ఆసనం ఒక నిర్ధిష్ట ప్రయోజనాలను కలిగి ఉంటుందని యోగా నిపుణులు చెబుతున్నారు. అయితే పిల్లల నుంచి పెద్దల వరకు ఏ వయసు వారైనా సులభంగా వేసే ఆసనాలు చాలా తక్కువ.
అలాంటి సులభమైన ఆసనాలలో త్రికోణాసనం ఒకటి. ఈ ఆసనం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు ఉన్నాయని యోగా నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల మానసిక ఒత్తిడి దురమౌతుందట. అంతే కాకుండా శరీర భాగాలన్నిటికి రక్త ప్రసరణను సవ్యంగా పెంచడంలో ఈ ఆసనం చక్కగా ఉపయోగ పడుతుందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా పొత్తి కడుపులో నొప్పి తుంటి, వెన్నునొప్పి సమస్యలు వంటివి ఉన్నవారు ఈ ఆసనం క్రమం తప్పకుండా వేస్తే అలాంటి సమస్యలని దురమౌతాయని చెబుతున్నారు యోగా నిపుణులు.
ఆసనం వేయు విధానం
ముందుగా చదునైన నేలపై నిటారుగా నిలబడాలి. ఆ తర్వాత రెండు కాళ్ళను వీలైనంత దూరంగా జరపాలి. చేతులను నేలకు సమాంతరంగా ఉంచుతూ కుడి చేతితో కుడి పదాన్ని తాకుతూ మెల్లగా బెండ్ అవ్వాలి. ఎడమ చేతిని నిటారుగా పైకెత్తి తలను ఎడమ చేతివైపు ఫోటోలో చూపిన విధంగా చేయాలి. ఇలాగే మరల రెండో వైపు కూడా చేయాలి.
గమనిక ; హైబీపీ లేదా లోబీపీ, నడుం నొప్పి, పార్శ్వ తలనొప్పి వంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ఆసనం వేయరాదని యోగా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఆసనం వేయడం వల్ల ఆ సమస్యలు ఉన్న వారికి రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందట.
Also Read:మే 27న వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక..