ఎండాకాలం వచ్చెసింది.. ఈ సమయంలో నీరు ఎక్కువగా తాగుతుంటాం.. అయితే ప్రయాణ సమయాల్లో, బయటికి వెళ్లినప్పుడు తాగు నీరు అందుబాటులో ఉండదు. అలాంటి పరిస్థితిలో మనం వాటర్ బాటిల్ కొనుకోని తాగుతాం.. మనం త్రాగే ఆ నీళ్లు మంచివేనా.. ఆ నీటీని శుద్ది చేసున్నారా..? ఇలా మనం అలోచించకుండా బయట దొరికే వాటర్‌ను తాగుతున్నాం.. ఇంతకీ మినరల్ వాటర్ మంచిదా?.. జనరల్ వాటర్ మంచిదా?.. అయితే మినరల్ వాటర్ కంటే జనరల్ వాటరే మంచివాట.. మినర్ వాటర్ వలన అనారోగ్యం పాలవుతన్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో మనం తాగే నీటిని ఏవేవో యంత్రాల ద్వార శుద్ధి చేసి… మినరల్ వాటర్ మంచివి అని తాగుతున్నాం. కొన్ని బడా కంపెనీలు లీటర్ వాటర్ బాటిల్‌ను 20 నుండి 100 వరకు అమ్ము తున్నారు. కాని వాటిలో స్వచ్చత ఉందా… అనే అనుమానం చాలా మందిలో ఉంది. అయితే ఈ తాజగా మినరల్ వాటర్ వాడకంపై సర్వేలు నిర్వహించారు. అందులో బయంకరమైన నిజాలు బయటపడ్డాయి…నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్ లా అమ్ము తున్నారు. దీని వలన ప్రమాదమే… కాని ఉపయోగం లేదు. మరో విషయం ఏంటంటే బయట మార్కెట్‌లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం కరిగి పోయి ఎముకలు బలహీనపడుతున్నాయి. దీని వలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న ప్రమాదాలకే విరిగిపోవడం జరుగుతున్నాయి.
ఇక అసలు విషయానికొస్తే.. మన పూర్వికులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ఆరోగ్యం కోసం కొన్ని విషయాలను చెప్పారు. అందులో ఇది ఒకటి. నీటిని ఎలా శుద్ధి చేసుకోవాలి.. పూర్వం రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు. వీటిని వాడటం వలన నీటిలో ఉండే సూక్ష్మ క్రిములు చని పోతాయి. ఈ మధ్య జరిగిన ఒక ప్రయోగంలో ”రోబ్ రీడ్” అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు, మట్టి పాత్రలు, ఇత్తడి, రాగి పాత్రలలో విరోచన కారి అయిన ఒక సూక్ష్మ క్రిమిని వేశారు. దీనిని 24 గంటల తరువాత పరిశీలించగా ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది. మళ్లీ 48 గంటల తరువాత పరిశీలించగా.. రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99శతం నశించి పోయాయి. కాని ప్లాస్టిక్, పాత్రలలో వేసిన క్రిమి 24 గంటలకి రెట్టింపు అయింది. 48 గంటలకి దానికి రెట్టింపు అయింది. అని కను గొన్నారు.
ఇటివల కాలంలో అనేక పెద్ద పెద్ద హోటల్స్‌లో రాగి పాత్రలని వాడటం మొదులుపెట్టారు. ఎందుకంటే హోటల్‌కి వచ్చేవారు ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా భద్రతానియమాలు పాటిస్తున్నారు..అయితే కాలాలను బట్టి నీరు త్రాగడానికి ఉపయోగించే పాత్రలు ఎంచుకోవడం ఆరోగ్యానికి శ్రేయష్కరం.. కాబట్టి వాన కాలంలో రాగి.. చలి కాలంలో ఇతడి.. ఎండ కాలంలో మట్టి పాత్రలలో (కుండ) నీరూ త్రాగడం మంచిది. కనుక రాగి, ఇత్తడి మట్టి పాత్రలను వాడండి ఆరోగ్యాన్ని కాపాడు కోండి.
ఇవి కూడా చదవండి..