వేపాకును మన పూర్వీకులు తరతరాల నుంచి దివ్య ఔషధ మొక్కగా పరిగణిస్తూ ఉంటారు. ఎన్నో వ్యాధులకు పరిష్కారంగా వేపాకును అటు ఆయుర్వేదంలోనూ ఇటు మెడిసన్స్ తయారీ లోనూ ఉపయోగిస్తుంటారు. వేపచెట్టులోని కాండం, వెరడు, ఆకులు, పూత, వేప గింజలు.. ఇలా ఇందులోని ప్రతిఒక్కటి ఆరోగ్య ప్రయోజనాన్ని కలిగించేవే. అందుకే వేపచెట్టును సర్వరోగ నివారిణి గా చెబుతుంటారు. ముఖ్యంగా వివిధ రకాల చర్మ సమస్యలను తగ్గించడంలోనూ, దంత సమస్యలను దూరం చేయడంలోనూ వేపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ లేత వేపాకులను టిలో వేసి మరింగించి తాగితే ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయి..
దాంతో జీర్ణ వ్యవస్థ సాఫీగా జరుగుతుంది. వేపాకులను ఎండలో నానబెట్టి పొడిగా చేసుకొని ఒక స్పూన్ వేప పొడిలో ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగితే.. రోగ నిరోదక శక్తి మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల కారణంగా శరీరంలో ప్రవేశించిన హానికరమైన వైరస్లు, బ్యాక్టీరియా వంటి వాటిని శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. మధుమేహం ఉన్నవారికి వేపపొడి ఎంతో ప్రయోజనకారి అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం భోజనానికి ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ వేపపొడి కలుపుకొని తాగితే షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుందట.
ఇంకా చర్మ వ్యాధులకు వేపాకు చేసే మేలు గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. గజ్జి, తామర, దురద, పొక్కుళ్ళు, వంటి చర్మ సమస్యలను పారద్రోలడంలో వేపాకు దివ్య ఔషధంలా పని చేస్తుంది. ఇక వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎంటు వంటి దంత సమస్యలనైనా, నోటి సమస్యలనైనా దూరం చేస్తాయి. నోటిపూట, చిగుళ్ళ వాపు, రక్తస్రావం, నోటి దుర్వాసన వంటి సమస్యలను దూరం చేసి నోటి పరిశుభ్రతకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. అందుకే వేపను టూత్ పేస్ట్ లలో ఇన్ గ్రీడియంట్ గా వాడుతుంటారు. కాబట్టి వేపాకు ఎన్నో రోగాలకు దివ్య ఔషధంలా పని చేస్తుందనే విషయాన్ని తప్పకుండా గ్రహించాలని నిపుణులు చెబుతున్నారు.
Also Read:శ్రీవారి బ్రహ్మోత్సలకు కళా బృందాలు..