మొన్న స్మిత్, నేడు వార్నర్.. వీళ్ళు ప్రెస్‌మీట్స్ పెట్టి కన్నీరు పెడుతున్నారే తప్ప, అసలు విషయాలను మాత్రం చెప్పకుండా గమ్మునుంటున్నరు. అవును.. ఈ డౌట్ ఏ ఒక్కరిదో అనుకుంటే పొరపాటే..ఇన్నాళ్ళూ వీళ్ళను అభిమానిస్తూ వచ్చిన లక్షలాది మంది క్రికెట్ లవర్స్‌లో మెదిలే డౌటే ఇది.
జీవితంలో తాను పెద్ద తప్పు చేసినట్టు శనివారం ప్రెస్ మీట్ పెట్టి కన్నీటి పర్యంతమయ్యాడు ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్. బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ..తప్పు చేశానంటూ పదే పదే చెప్తూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు.
అసలు బాల్ ట్యాంపరింగ్ ఆలోచన ఎవరిది..? సాండ్ పేపర్‌ను ఎవరు తెచ్చారు..? అసలు ఈ తతంగానికంతా ఎవరు ప్రధాన సూత్రదారి..? అని సమావేశంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు మాత్రం వార్నర్ సెలెంట్ గా ఉండిపోయాడు. ఇక అన్నీటికీ సెలెంట్‌గా ఉండిపోతే..అసలు ఈ సమావేశం ఎందుకని కూడా గట్టిగానే నిలదీశారు ఓ జర్నలిస్ట్.
ఇక ఇదిలా ఉంటే..సమావేశం అనంతరం ..మీడియా ప్రశ్నలకు సమాధానాలివ్వలేకపోయానంటూ తన ట్విట్టర్ లో స్పంధించాడు వార్నర్. ఆస్ట్రేలియాకు ఓ పద్దతి ఉంటుందని, సీఏ దర్యాప్తు సాగుతోందని, అందుకే తాను మౌనంగా ఉన్నట్టు వెల్లడించాడు. సీఏ ఆదేశాల ప్రకారమే సెలెంట్‌గా ఉన్నానని, సీఏ నుంచి క్లియరెన్స్ వచ్చాక, సరైన సమయంలో, సరైన వేధికపై ఆ ప్రశ్నలకు జవాబిస్తానంటూ ట్విట్టర్‌లో చెప్పుకొచ్చాడు.