- Advertisement -
తన కాన్వాయ్‌లోని వాహనాలకు వీఐపీ నంబర్లను ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు హర్యానా ఈసెం మనోహర్ లాల్ ఖట్టర్. ఇకపై తన కార్లకు వీఐపీ నంబర్లను ఉపయోగించనని తెలిపారు.
ఈ మేరకు హర్యానా మోటార్ వెహికల్స్ రూల్స్-1993లో సవరణ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 179 వాహనాలకు కేటాయించిన వీఐపీ నంబర్లను వేలానికి వెల్లనుండగా ప్రభుత్వానికి రూ. 18 కోట్ల ఆదాయం సమకూరనుంది.
వీఐపీ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటాయని…ఫ్యాన్సీ నంబర్లను కొనుగోలుచేయాలనుకునేవారికి ఇది మేలుచేస్తుందన్నారు.
- Advertisement -