పొవార్‌కు మద్దతుగా హర్మన్‌

288
harmanpreet
- Advertisement -

కోచ్ రమేష్ పొవార్-వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ మధ్య రాజుకున్న వివాదం రోజుకో మలుపుతిరుగుతోంది. రమేష్ పొవార్‌కు మద్దతుగా నిలిచారు టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్,వైస్ కెప్టెన్ స్మృతి మందాన.ఈ మేరకు బీసీసీఐకి లేఖరాసిన వీరిద్దరూ 15 నెలల్లో న్యూజిలాండ్‌లో టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో కోచ్‌గా పొవార్‌ ఉంటే బాగుంటుందని తెలిపారు.

వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓడిపోవడం తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని వారు లేఖలో పేర్కొన్నారు. వివాదాలతో జట్టు ప్రతిష్ట మసకబారడం బాధాకరమని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కోచ్‌కు సమయం పడుతుందని..కాబట్టి పొవార్‌నే కొనసాగించాలని సూచించారు. పొవార్ జట్టును ఎంతగానో మార్చాడని..ఆయన మాలో స్ఫూర్తి నింపి, విజయ కాంక్షను పెంచాడని తెలిపారు. మహిళా క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చిన ఘనత పొవార్‌కే దక్కుతుందని వెల్లడించారు. మిథాలీని తప్పించడానికి పొవార్‌ మాత్రమే కారణం కాదని వారు స్పష్టం చేశారు.

టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్‌లో మిథాలీని పక్కనబెట్టడంతో వివాదం రాజుకుంది. బీసీసీఐకి లేఖరాసిన మిథాలీ..కోచ్ పొవార్‌పై మండిపడింది. తర్వాత పొవార్‌ కూడా అదేస్థాయిలో మిథాలీపై ఆరోపణలు చేయడంతో వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో కోచ్‌గా పొవార్ కాంట్రాక్టు ముగిచడం కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ దరఖాస్తుల కోసం ఆహ్వానించడంతో ఆయన కథ ముగిసినట్టేనని అంతా భావించారు. కానీ హర్మన్,స్మృతి లేఖతో సీన్ రివర్సైంది.

- Advertisement -