Harishrao:కాంగ్రెస్‌వి మోసపూరిత మాటలు

51
- Advertisement -

అన్ని రంగాల్లో నేడు హుస్నాబాద్ అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి హరీశ్‌ రావు. హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడ రోడ్ షోలో మాట్లాడిన హరీశ్‌ రావు..ఎన్నికలు అంటే మూడు రోజుల పండుగ కాదు, ఐదేళ్ల భవిషత్, మన అభివృద్ధి అన్నారు. సీఎం కేసీఆర్ సీఎం అయ్యాక హుస్నాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని…గతంలో ఎంతో మంది వచ్చి వెళ్ళారు. నీళ్ళు ఇవ్వలేదు, రోడ్లు ఇవ్వలేదన్నారు. కేసీఆర్ వల్ల కాళేశ్వరం అయ్యిందని… శనిగరం ద్వారా నీళ్ళు వస్తున్నాయన్నారు.

అన్ని గ్రామాలకు మహిళా భవనాలు పూర్తి చేశాం అని…సిద్దిపేట జిల్లాలో కలిసాక ఒకవైపు నేను, మరోవైపు సతీష్ అన్న అండగా ఉన్నారన్నారు. ఆరు గ్యారెంటీలు అని చెప్పి కర్ణాటకలో మోసం చేశారని..పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది వాళ్ళ పరిస్థితి అయిందన్నారు. కర్ణాటకలో కరెంట్ కోతలు అని అక్కడి రైతులు బాధపడుతున్నారని…గతంలో ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండే, కరెంట్ కోతలపై పాటలు వచ్చాయన్నారు.ఇంత బాగా కరెంట్ ఇస్తుంటే రిస్క్ లో పడటం ఎందుకు ఆలోచించాలన్నారు.

రేవంత్ రెడ్డి, మూడు గంటల కరెంట్ ఇవ్వాలి, 10 HP మోటార్ పెట్టాలి అంటున్నారు…హార్ట్స్ పవర్ అంటే కూడా తెలియకుండా రేవంత్ మాట్లాడారన్నారు. కాంగ్రెస్ ను నమ్మితే కైలాసం ఆటలో పాము మింగినట్టేనని…ఆరు గ్యారెంటీలు ఏమో గానీ, ఆరు నెలలకు ఒక్కరూ సీఎం అవుతారన్నారు. పొన్నం ప్రభాకర్ పెద్ద పెద్ద పోస్టర్లు వేశారు. వాళ్ళ దాంట్లో ఉన్న దానికంటే మన మేనిఫెస్టో ఎంతో మంచిదన్నారు.వాళ్లది 500 గ్యాస్ సిలిండర్ అంటే, మనం 400 అన్నామన్నారు. వాళ్ళు 2000 మహిళలకు ఇస్తా అంటే, మనం3000 సౌభాగ్య లక్ష్మి ద్వారా ఇవ్వనోతున్నాం అన్నారు. పింఛన్లు 4 వేలు అంటే, మనం 5 వేలు ఇవ్వబోతున్నం అన్నారు. రైతు బంధు ద్వారా ఎకరానికి 16 వేలు ఇస్తాం అన్నారు.

Also Read:దేశంలో జమిలి ఎలక్షన్స్ కన్ఫర్మ్?

- Advertisement -