గొప్ప మాస్ హీరో.. కానీ పాపం!

51
- Advertisement -

తను మాస్ హీరోగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఓ దశలో సూపర్ స్టార్ రజనీకాంత్ ను సైతం వెనక్కి నెట్టాడు. తమిళ నాట తనదే పై చేయి అనిపించుకున్నాడు. అతనే.. విజయ్ కాంత్. వ్యక్తిగతంగా మంచోడు. ప్రజలకు మంచి చేయాలని సినిమా కెరీర్ ను సైతం పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ, ఆశించిన స్థాయిలో రాజకీయంగా తన మార్క్ ను చూపించలేక పోయాడు. దీనికి కారణం ఆయన అనారోగ్యమే. మొన్నటి నుంచి విజయ్ కాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు అని వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

చెన్నైలోని ఓ ఆస్పత్రిలో రెండు రోజుల నుంచే చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షిణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధుమేహంతో బాధపడుతున్న విజయ్‌కాంత్ కాలి వేళ్లకు రక్తం సరఫరా కాకపోవడంతో వైద్యులు అత్యవసరంగా ఆ వేళ్లను తొలగించారు. ఇక ఆయన ఆరోగ్యం కూడా బాగా క్షీణించినట్టు వైద్యులు వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ కాంత్ పూర్తిగా కోలుకోవడం అసాధ్యమే. ఆయన కోలుకున్నా.. ఇంటికి మాత్రమే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. అభిమానులు బాధ పడుతున్నారు. ఎందుకు తమ హీరోకే ఈ కష్టాలు అని. నిజానికి విజయ్ కాంత్ ఆరోగ్యం పై మొదటి నుంచి శ్రద్ద తీసుకోలేదు.

అందుకే, ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు విషమంగా తయారు అవుతుంది. ఏది ఏమైనా విజయ్ కాంత్ రాజకీయ ముద్ర బలంగా పడకముందే.. ఇలా ఇంటికే పరిమితం కావడం చాలా బాధాకరమైన విషయం. కానీ, డీఎంయూడీ వ్యవస్థాపకుడిగా, ప్ర‌ముఖ త‌మిళ న‌టుడిగా, నటీనటుల సంఘం మాజీ అధ్యక్షుడిగా విజయకాంత్‌ చేసిన సేవ ఎప్పటికీ తమిళ ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. చెన్నైలోని మయత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ప్రస్తుతానికి అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది.

Also Read:5 భాషల్లో …ఉపేంద్ర గాడి అడ్డా

- Advertisement -