Harishrao:సిద్దిపేట ప్రజల గౌరవాన్ని నిలబెడుదాం

39
- Advertisement -

సిద్దిపేట ప్రజల గౌరవాన్ని నిలబెడుదాం అన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట నియోజకవర్గం స్తాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన హరీశ్..చేసింది చెపుదాం… సిద్దిపేట ప్రజల గౌరవాన్ని నిలబెడుదాం అన్నారు. ప్రజలు కోరే అభివృద్ధి చేసుకున్నాం… ప్రేమ తో ప్రజలను ఓటు అడగండన్నారు. మేనిఫెస్టో ను వివరించండి… మన అభివృద్ధి చెప్పాలన్నారు. అభివృద్ధి అంటే సిద్దిపేట నేనా అన్న ప్రతిపక్షాలు ఎం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతాయన్నారు. అభివృద్ధి ని ఓర్వ లేని ప్రతిపక్షాలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు అన్నారు.

సిద్దిపేట లో మనకు ఏపార్టీ తో పోటీ లేదు.. మనకు మనకే పోటీ అన్నారు. మండలం మండలం పోటీ పడండి… ఎక్కువ శాతం తెచ్చుకున్న మండలం కు బహుమతి ఇస్తానని… సిద్దిపేట అభివృద్ధి ని చూసి నేర్చుకునేలా చేసినం అన్నారు. సిద్దిపేట కార్యకర్తలకు ఎమ్మెల్యే, కార్యకర్త అనుబంధం కాదు. కుటుంబ అనుబంధం మనదన్నారు. ప్రభాకరన్న కు అండగా ఉందాము..దుబ్బాక గెలుపు బాధ్యత మన ఫై ఉందని… ఎవరికి ఆపద వచ్చినా కలిసి ఉన్నాం. కష్టపడి అభివ్రుది చేసుకున్నాం అన్నారు.

సిద్దిపేట అభివృద్ధి అడ్డుకున్న వాళ్లకు ఇక్కడ ఓటు అడిగే హక్కు లేదని…కెసిఆర్ పాలనలో సంక్షేమ ఫలాలు అందని ఇల్లే లేదు అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలను ప్రజలకు గుర్తు చేయాలి..రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, నిరంతర కరెంటు, సాగునీరు, తాగునీరు.. ఇవన్నీ ప్రతి ఇంటికి గుర్తు చేయాలన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా రూ. 15 లక్షల చికిత్స ఉచితంగా అందించబోతున్నాం అని.. సౌభాగ్య లక్ష్మి ద్వారా మహిళలకు 3 వేలు అందించబోతున్నాం అన్నారు.

Also Read:హార్రర్ థ్రిల్లర్.. ‘హి’

- Advertisement -