Harishrao:ఎంపీ ఎన్నికల తర్వాత కరెంట్ కోతలే

23
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయిలో కరెంట్ కోతలుంటాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరుతూ జ‌హీరాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మున్నూరు కాపు సంఘం నేత‌లు తెలంగాణ భవన్‌లో హరీశ్ రావును కలిసి వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్‌… కేసీఆర్ పాల‌న‌లో ఏ రోజు కూడా క‌రెంట్ పోలేదన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో క‌రెంట్ కోత‌లు మొద‌ల‌య్యాయ‌ని రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు వంద రోజుల్లో 13 హామీలు అన్నారు కానీ ఒక్కటి నెరవేర్చే పరిస్థితిలో లేరన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ఈ మాత్రం కరెంట్ ఇస్తోంది. ఎన్నికలు అయిపోతే కరెంట్ కోతలు పూర్తి స్థాయిలో ఉంటాయన్నారు.

మోదీని బడే భాయ్ అని, ఎల్లప్పుడూ ఆయన ఆశీర్వాదం ఉండాలని రేవంత్ అన్నాడు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదు అని రేవంత్ చెప్పకనే చెప్పారు. రుణమాఫీ, రైతు బంధు, కరెంట్, బోనస్ ఇవ్వనందుకు రైతులు ఏకమై వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చుర‌క‌ పెట్టాలన్నారు హరీశ్‌రావు.

Also Read:11న తెలంగాణ కేబినెట్ భేటీ

- Advertisement -