Harish:అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు

37
- Advertisement -

అభివృద్దిని చూసి ఓర్వలేకే ప్రధానమంత్రి నరేంద్రమోడీ…సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పారు మంత్రి హరీష్ రావు.కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో తెలంగాణకు అవార్డులు ఇచ్చి.. గల్లీలో తిట్టడం పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు.

వరంగల్‌లో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హరీష్. తెలంగాణకు చాలా నిధులు ఇచ్చామని ప్రధాని చెప్పారు. మీరు డబ్బులు ఇవ్వలేదు.. మాకు రావాల్సిన నిధులు ఆపారు.. మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే, నిజంగా మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Also Read:BRS:తిరుగులేని రాజకీయ శక్తి

నీతి అయోగ్ చెప్పినా డబ్బులు ఇవ్వలేదని…బావుల కాడ మీటర్లు పెట్టాలేదనీ 21 వేల కోట్లు ఆపింది మీరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిని మోడీ సర్కార్ అడ్డుకుంటుందన్నారు. కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వ్యాగన్ యూనిట్ ఇచ్చారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు. బురద జల్లుడు తప్ప మీరు చేసేందేమి లేదు అన్నారు.

Also Read:Gadkari:మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం

- Advertisement -