Harishrao:కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం

6
- Advertisement -

నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ చేసిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ చేసిన మోసంపై సోషల్ మీడియాలో పోస్టు చేసిన హరీశ్‌…గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100, గ్రూప్ 2 & 3 పోస్టులు పెంచాలని అభ్యర్థులు.. నాయకుల కాళ్ళు పట్టుకొని వేడుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

డీఎస్సీ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య పెంచడంతోపాటు, ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నిరుద్యోగులను అనేక విధాలుగా రెచ్చగొట్టిన నాయకులు, అధికారంలోకి రాగానే వారి పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. అందుకు ఈ దృశ్యాలే సజీవ సాక్ష్యమని…30 వేల ఉద్యోగాలు ఇచ్చామని డబ్బా కొట్టుకోవడం తప్ప, యువత, నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమిటి అని నిలదీశారు.

Also Read:Roja:మంచి చేసి ఓడిపోయాం

- Advertisement -