బండి సంజయ్ బండారం బయటపెట్టిన మంత్రి హరీష్‌రావు..!

124
harish
- Advertisement -

కేవలం రాజకీయ కక్షతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి రైతుల నోట్లో మట్టి కొట్టిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బండారాన్ని మంత్రి హరీష్‌రావు అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి బండి సంజయ్ రాసిన లేఖలను మంత్రి హరీష్‌ అసెంబ్లీలో బయటపెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. కాళేశ్వరంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు రావడంతో బండి సంజయ్ జీర్ణించుకోలేకపోయాడు. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన పాలమూరు రంగారెడ్డి, సీతారామ వంటి సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి అయితే రైతులంతా టీఆర్ఎస్‌ వైపు మొగ్గు చూపుతారన్న భయంతో బండి సంజయ్ కొత్త కుట్రలకు తెరతీశాడు. అనుమతులు వచ్చేవరకూ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వవద్దని, ఇందుకోసం తెలంగాణకు మాత్రమే వర్తించేలా ప్రత్యేక చట్టం తేవాలని కేంద్ర మంత్రులు జవదేకర్‌, షెకావత్‌లకు బండి సంజయ్ లేఖలు రాశాడు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రాసిన ఈ లేఖలను మంత్రి హరీష్‌రావు స్వయంగా అసెంబ్లీలో చదివి వినిపించి బండి బండారం బయటపెట్టారు ఈ సందర్భంగా బండి సంజయ్ తీరుపై మంత్రి మండిపడ్డారు.

స్వార్థ రాజకీయాల కోసం, పదవుల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెడతారా అంటూ హరీష్‌రావు ఫైర్ అయ్యారు.. వాస్తవంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్ర జల సంఘం నుంచి 16 అనుమతులు తీసుకోవాలని, వాటిలో అటవీ, పర్యావరణ అనుమతుల కోసం ముందు ప్రయత్నిస్తామని, కానీ, సీడబ్ల్యూసీ అనుమతులు వచ్చేదాకా పర్యావరణ అనుమతులు ఇవ్వవ ద్దంటూ సంజయ్‌ లేఖ కేంద్రమంత్రులకు లేఖలు రాశారని, కావాలని టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజకీయ కక్షతో తెలంగాణ ప్రాజెక్టులు ఆలస్యమయ్యేలా లేఖలు రాశారని హరీష్ రావు ధ్వజమెత్తారు. పొద్దున లేస్తే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దేశం కోసం..ధర్మం కోసం అంటూ డైలాగులు కొడతారని…వారికి ఉన్న దేశభ క్తి సరే.. స్వరాష్ట్రంపై భక్తి ఎక్కడకు పోయింది? అని మంత్రి ప్రశ్నించారు. ఎన్నుకున్న రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పట్టవా? రాజకీయ ప్రయోజనాలపైనే వారి ధ్యాస ఉంటుందా? రైతుల నోట్లో మట్టి కొట్టడానికి రాజకీయం చేస్తారా..? అంటూ హరీష్‌రావు బండిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రాష్ట్రానికి సహాయం చేయకపోయినా, రైతులకు మేలు చేకూర్చే ప్రాజెక్టులను అడ్డుకోవద్దని బండికి హితవు పలికారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు గతంలో కొందరు కాంగ్రెస్ నేతలు కోరుల్లో, గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో కేసులు వేశారని, ఇప్పుడు బీజేపీ నేతలు ఏకంగా చట్టమే తేవాలని కోరుతున్నారని ధ్వజమెత్తారు. దేశమంతా ఒక న్యాయం? తెలంగాణకు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టరాదన్న ఉద్దేశం ఇక్కడి బీజేపీ నేతల్లో కనిపిస్తుందని విమర్శించారు. చేతనైతే.. తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టును సాధిస్తే.. వారిని సన్మానిస్తామని ఎద్దేవా చేశారు. ప్రజల ప్రయోజనాలు దెబ్బతినకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. కానీ, మన ప్రాజెక్టులను మన వారే ఆపే దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. క్షుద్ర రాజకీయాలు తగవు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం కలిసి రండి అంటూ మంత్రి హరీష్‌రావు తెలంగాణ బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వద్దు అంటూ కేంద్రానికి లేఖలు రాసిన బండి సంజయ్‌పై రైతన్నలు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి అయితే టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వద్దు అంటూ లేఖలు రాసి…మానోట్లో మట్టి కొడతావా అంటూ బండి సంజయ్‌పై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్‌ ఇలాగే వ్యవహరిస్తే మున్ముందు రైతన్నలు బీజేపీని బొందపెట్టడం ఖాయం..బీకేర్‌ఫుల్ బండి..!

- Advertisement -