కాంగ్రెస్ అంటేనే కరువన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడిన హరీశ్ రావు….కేసీఆర్ 24గంటలు కోతల్లేని కరెంటు ఇచ్చారన్నారు.ఎర్రటి ఎండల్లో కూడా చెరువులు మత్తడి దుంకినయని చెప్పారు.
కానీ కాంగ్రెస్ పాలనలో చిన్నకోడూరులో ఆరుగంటలే కరెంట్ వచ్చేదని.. రూ.90వేలకోట్ల ఖర్చుతో కేసీఆర్ కరెంట్‌ని బాగు చేశారన్నారు. కేసీఆర్ పాలనలోనే పదేళ్లు కరువే లేదని.. కాంగ్రెస్ అడుగుపెట్టింది.. మళ్లీ కరువొచ్చిందన్నారు. రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. రూ.2లక్షల రుణమాఫీ కానివాళ్లు బీఆర్‌ఎస్ ఓటేయాలని కోరారు.
రూ.200 ఉన్న పింఛన్ కేసీఆర్ రూ.2వేలకు పెంచారని.. కాంగ్రెస్ వాళ్లు ప్రతినెలా ఆడబిడ్డల ఖాతాల్లో రూ.2500 వేస్తానన్నారని.. ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రతి ఆడబిడ్డకు కాంగ్రెస్ నాలుగు నెలల్లో రూ.10వేలు బాకీ పడ్డదని.. రూ.10వేలు ఇచ్చినంకనే ఓటడగాలని కాంగ్రెస్‌ను నిలదీయాలన్నారు.
Also Read:#Gopichand32 @ విశ్వం