విద్యార్థుల గోస కనిపించడం లేదా?

5
- Advertisement -

ప్రశ్నించిన వారిపై, ప్రతిపక్షాలపై జులుం ప్రదర్శించే సీఎం రేవంత్ రెడ్డి.. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పాదయాత్ర చేస్తున్న ఈ గురుకుల విద్యార్థులకు ఏమని సమాధానం చెబుతావు? అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. పరిపాలన గాలికి వదిలేసి, అనునిత్యం రాజకీయాలు చేసే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి గురుకుల విద్యార్థుల గోస కనిపించకపోవడం అమానవీయం అన్నారు.

తరగతి గదుల్లో ఉండాల్సిన భావి భారత విద్యార్థులను నడిరోడ్డు ఎక్కించిన దుర్మార్గ చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది…చదువుకోవాల్సిన పిల్లలను పట్టెడు అన్నం కోసం, తాగు నీళ్ళ కోసం పాదయాత్రలు చేసే దుస్థితి కల్పించింది నీ అసమర్ధ పాలన అన్నారు. We want justice అన్నందుకు పోలీసులను పెట్టి, బలవంతంగా డీసీఎంలలో విద్యార్థులను తరలించిన నీచమైన చరిత్ర ఈ ఇందిరమ్మ రాజ్యానిది అన్నారు.

గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, సమస్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక అడిగినా ప్రభుత్వంలో చలనం కలుగదా?,రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరువు.. మీ పాలనలో రోజు రోజుకీ పతనమవుతున్న గురుకుల వ్యవస్థను గాడిన పెట్టు అన్నారు.జోగులాంబ గద్వాల్ జిల్లా, అలంపూర్ చౌరస్తా నుంచి పాదయాత్రగా వెళ్లి జిల్లా కలెక్టర్ కు విద్యార్థులు ఇవ్వాలనుకున్న ఫిర్యాదుకు తక్షణం పరిష్కారం చూపించు…స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం మరోసారి పాదయాత్ర డ్రామాలు మొదలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ.. గురుకుల విద్యార్థులు చేస్తున్న పాదయాత్రల మీద ముందు దృష్టి సారించాలి అని ఎద్దేవా చేశారు.

Also Read:బీఆర్ఎస్ పార్టీకి సింపతి ఉంది:ఫిరోజ్ ఖాన్

- Advertisement -