Harish:ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ

4
- Advertisement -

సిద్దిపేట MLA క్యాంపు కార్యాలయం లో సిద్దిపేట ఆటో ఎలక్ట్రీకల్ యూనియన్ సభ్యులకు, డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు హరీష్ రావు.తన స్వంత ఖర్చులతో కంటి పరీక్షలు చేయించి అవసరం అయిన వారికి కంటి అద్దాలు ఉచితంగా పంపిణీ.. ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్.. సిద్దిపేట జిల్లా కు చెందిన పేద ప్రజలకు కంటి పరీక్షలు, అవసరమైన ఆపరేషన్లు పూర్తిగా ఉచితంగా నిర్వహించాలని ఉద్దేశ్యం తో సిద్దిపేట లో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ని ఏర్పాటు చేయించాము.. సిద్దిపేట ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి ప్రజల కంటికి రక్షణ కవచం..ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి ని సద్వినియోగం చేసుకోవాలి.. ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే నిజమైన అభివృద్ధి.. నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లో ఎల్వి ప్రసాద్ సేవలు అందించాం.. డ్రైవర్లు కంటి పరీక్షలు చేపించుకోవాలి… ఉచితంగా కంటి పరీక్షలు, అద్దాలు ఇప్పించే బాధ్యత నాది… సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం అన్నారు.

పేదలకు ఎలాంటి ఆర్ధిక భారం లేకుండా చికిత్స అందించేందుకు ఆసుపత్రి ఎంతో ఉపయోగ పడుతుంది..ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి …హైదరాబాద్‌కు వెళ్లే స్థోమత లేని ఎంతో మంది మన మధ్య ఉన్నారు. అలాంటి వారికి ఇక్కడే నాణ్యమైన వైద్యం అందించాలన్నదే ఈ కేంద్రం ప్రారంభించిన ముఖ్య ఉద్దేశం.ఇప్పటికే అనేక మందికి చికిత్సలు, ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించే ఏర్పాటు చేశాం..ముఖ్యంగా మోటార్‌బైక్ , బస్సు డ్రైవర్లు, మెకానిక్‌లు, ఎలక్ట్రిషియన్‌లు వంటి వృత్తుల వారికీ ఈ సేవలు ఎంతోఉపయోగపడుతున్నాయి…40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత చాలామందికి కంటి సమస్యలు వస్తుంటాయి. కానీ చాలా మంది పరీక్షలు చేయించుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు… ప్రతి ఒక్కరూ తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. ఎవరికైనా కళ్లద్దాలు అవసరమైతే కళ్లద్దాలు, ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్ — పూర్తి బాధ్యత నేను తీసుకుని చేయిస్తాను. ఎలాంటి ఆందోళన అవసరం లేదు… సిద్దిపేట లో విద్య, ఆరోగ్యం, తాగునీరు, రోడ్లు వంటి ప్రతి రంగంలో అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం అన్నారు.

తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము.కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నీటి కొరత ఉన్నప్పటికీ, సిద్ధిపేట పట్టణంలో మాత్రం అలాంటి సమస్య లేకుండా చూడగలిగాం…హైదరాబాద్‌లో కూడా నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి, కానీ సిద్ధిపేటలో ప్రజలకు ఆ ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నాం..మీరు అందరూ మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలి. మీ అభివృద్ధే మా ఆనందం. మీ సంఘం నాయకులు కొన్ని అవసరాలను నా దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తాం. మరింత మంది ఈ సేవలను వినియోగించుకునేలా అందరికీ సమాచారం ఇవ్వండి.ప్రభుత్వాలు మారినా ప్రజలకు ఉపయోగపడే పనులు కొనసాగాలి. ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలకు ఎప్పుడూ నా సహకారం ఉంటుంది.
అవసరమైన చోట సహాయం అందించేందుకు నేను సిద్ధంగా ఉంటాను.ఈ రోజు ఏర్పాటు చేసిన వైద్య పరీక్షల కేంద్రం మీ అందరి ప్రయోజనం కోసమే. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి అన్నారు.

Also Read:NPPA:ఈ మెడిసిన్స్‌ ఇక చౌకే!

- Advertisement -