చెట్టు – బొట్టు కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు..

50
- Advertisement -

సిద్దిపేట మున్సిపల్ సంఘం ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్.. చెట్టు – బొట్టు కార్యక్రమంతో ప్రతి ఇంటికి చెట్లను అందించడమే లక్ష్యం అన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం ఎంతో అవసరం అన్నారు.

చెట్ల పెంపకం ద్వారా 7.4 శాతం గ్రీన్ కవర్ పెంపొందించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అన్నారు.ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆస్పత్రులు కట్టడం తోపాటు.. వ్యాధులు రాకుండా జాగ్రత్త పడడం అవసరం అన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందించి ఊపిరి తిత్తులను కాపాడాలన్నారు. చెట్లు పెంచడం ద్వారా మంచి ఆరోగ్య లభిస్తుందన్నారు.

మిషన్ భగీరథ ద్వారా ఉపరితల స్వచ్ఛమైన గోదావరి నీరు అందిస్తున్నామన్నారు. హరిత హరంలో భాగంగా మొక్కల పెంపకం ప్రారంభించాం…మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది ప్రతిరోజూ ఉదయం వార్డులలో చెత్త ఏరడం ఒక మంచి పరిణామం అన్నారు. కౌన్సిలర్లు చెత్త ఏరడంతో ప్రజల్లో అవగాహన, చైతన్యం కలుగుతుందన్నారు. జాతీయస్థాయిలో సిటిజన్ ఫీడ్బ్యాక్ లో సిద్దిపేట రెండో స్థానంలో ఉందని…అందరం కష్టపడి మొదటి స్థానం కోసం కృషి చేయాలన్నారు.

Also Read:దటీజ్ చిరు…’భోళా శంకర్‌’

- Advertisement -