మళ్ళీ మొదలెట్టిన బీజేపీ?

48
- Advertisement -

తెలంగాణలో గత కొన్ని రోజులుగా బీజేపీ దూకుడు అనుకున్న స్థాయిలో సాగడంలేదు. దీనికి ప్రధాన కారణం కర్నాటక ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిపాలు కావడమే. అంతకు ముందు బి‌ఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనాని అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని కమలనాథులు చూపిన కాన్ఫిడెన్స్ అంతా ఇంతా కాదు. ఇలా కల్లబొల్లి మాటలు చెబుతూ ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. చేరికల కమిటీ ఛైర్మన్ గా ఈటెల రాజేందర్ కు ఆ బాధ్యతలు అప్పగించారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని నమ్మబలికారు. కట్ చేస్తే ఆ పదవిలో ఈటెల సంతృప్తిగా లేకపోవడం, చేరికలపై చేసిన వ్యాఖ్యలని ఒట్టి కబుర్లుగానే మిగిలిపోయాయి.

ఇదే సమయంలో కర్నాటక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరఓటమి చవి చూడడంతో చేరికలు పూర్తిగా ఆగిపోయాయి. అంతే కాకుండా సొంత పార్టీ నేతలే ఓటమి భయంతో ఇతర పార్టీలవైపు చూసే పరిస్థితి. దీంతో పార్టీ ప్రక్షాళనపై దృష్టి పెట్టిన అధిష్టానం.. చాలానే మార్పులు చేసింది. అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పించి.. కిషన్ రెడ్డిని నియమించింది. ఎన్నికల కమిటీ చైర్మెన్ హోదాను ఈటెలకు కట్టబెట్టింది. ఇక తాజాగా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.

Also Read:GIC:జ్ఞాపకంలోనూ మరవని స్పూర్తి..ఎంపీ సంతోష్ ప్రశంస

ఇలా లెక్కకు మించి పార్టీలో మార్పులు చేసింది అధిష్టానం. ఇప్పుడు కొత్త పదవులతో నేతలను ఎన్నికల బరిలో నిలిపింది. దీంతో ఆ మద్య పదవుల విషయంలో నెలకూన్న బేదాభిప్రాయాలు కొంత సద్దుమనగడంతో మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ పై దృష్టి పెట్టింది. ముఖ్యంగా కాంగ్రెస్ లోని మాజీలను ఆకర్షించే పనిలో ఉంది కమలం పార్టీ. ఇప్పటికే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి వంటి వారు బీజేపీ గూటికి చేరారు. ఇంకా మరికొంత మంది మాజీలు కాషాయ గూటికి చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆ మద్య చేరికల విషయంలో కొంత స్లో అయిన బీజేపీ మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Also Read:వామ్మో ప్రభాస్ నాన్ స్టాప్ దూకుడు..?

- Advertisement -