బట్ట కాల్చి మీదేస్తే ఊరుకోం:హరీశ్

1
- Advertisement -

రాజకీయాల్లో విమర్శలకు ఒక హద్దు, పద్దు ఉండాలని, బట్టకాల్చి మీద వేసే దుష్ప్రచారాలను ఎంతమాత్రం ఊరుకునేది లేదని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపై కొందరు చేస్తున్న క్షుద్రపూజల ఆరోపణలపై ఆయన ఘాటుగా స్పందించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, వరుస స్కామ్‌లను పక్కా ఆధారాలతో తాము బయటపెడుతుండటంతో తట్టుకోలేకనే తనపై ఇలాంటి అసత్య ప్రచారాలకు తెగబడుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. నాలుక ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

గతంలో తనపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. నాడు అడ్డగోలుగా మాట్లాడిన కొండా సురేఖ నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. రేపు ఈ అసత్య ఆరోపణలు చేసిన వారి విషయంలో కూడా క్రిమినల్ సూట్ మరియు డిఫమేషన్ (మాననష్ట దావా) కేసులు వేస్తాను అని స్పష్టం చేశారు.

Also Read:బడికి వెళ్లాలంటే ప్రాణాలు పణంగా పెట్టాలా!

ఇప్పటికే ఈ వ్యవహారంలో సంబంధిత వ్యక్తులకు లీగల్ నోటీసులు ఇచ్చామని, చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హరీశ్ రావు హెచ్చరించారు.

- Advertisement -